శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై తితిదే స్పష్టత
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుమల
శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు తితిదే తగిన వివరణ ఇచ్చింది. అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా ఉంటుందని తితిదే అధికారులు స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బుకింగ్ వ్యవస్థను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టికెట్ లభించకపోవడాన్ని, ఆన్లైన్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది.