నిర్మాతగా మారిన ప్రముఖ యాంకర్ ఉదయభాను
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ప్రముఖ యాంకర్ ఉదయభాను సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 'ఉదయభాను ప్రొడక్షన్స్' పేరుతో సొంత బ్యానర్‌ను స్థాపించి, తొలి ప్రయత్నంగా 'పంచనామా' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో భరత్ శ్రీనివాసన్ హీరోగా నటిస్తున్నారు. ఈ ఉత్కంఠభరిత వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' వేదికగా స్ట్రీమింగ్ కానుంది.