మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి: పదిహేను బిలియన్ల నష్టం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Washington
మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడిలో వందలాది కట్టడాలు ధ్వంసమయ్యాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల వల్ల వాషింగ్టన్ కు దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల మేర భారీ పునర్నిర్మాణ భారం పడే అవకాశం ఉందని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇరవై నాలుగు స్థావరాలలో రెండు వందల డెబ్బై నాలుగు కట్టడాలు దెబ్బతిన్నట్లు పరిశోధనలో తేలిందని అధికారులు పేర్కొన్నారు.