జనసేనలోకి వలసల జోరు: భోగాపురంలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన వందలాది మంది

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం నందిగాం గ్రామంలో వైసీపీని వీడి యాభై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయని లోకం నాగ మాధవి వెల్లడించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమవుతోందని ఆమె తెలిపారు. గరే కన్నబాబుతో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారని ఆమె స్పష్టం చేశారు.