'గ్లోబల్ హబ్‌గా భారత్': సెమీకాన్ ఇండియా సదస్సులో మోదీ ప్రకటన

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ శరవేగంగా ముందుకు వెళ్తోందని, ప్రపంచ చిప్‌ తయారీకి నమ్మకమైన కేంద్రంగా భారత్‌ గ్లోబల్ హబ్గా సిద్ధమవుతోందని దిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో సెమీకండక్టర్‌ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటికే 12 చిప్‌ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్‌ డాలర్ల నుంచి 13.5 బిలియన్‌ డాలర్లకు పెంచినట్లు ప్రధాని వెల్లడించారు.