బీబీనగర్ విద్యాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లేష్ గౌడ్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండూరి మల్లేష్ గౌడ్ ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం రోజున బీబీనగర్ మండలం విద్యాధికారి సురేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. వారితో పాటు బీబీనగర్ మండల అధ్యక్షులు కోనార్క్ రావు, ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.