'తొలగించే అధికారం లేదు': 22ఏ భూముల వివాదంపై సీఎం రేవంత్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో అటవీ, అసైన్డ్, దేవాదాయ శాఖ భూములు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉండాల్సిందేనని, వాటిని తొలగించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా భూముల దందా జరిగిందని, రాష్ట్రంలోని కోట్ల ఎకరాల భూముల వివరాలు విదేశాల చేతికి వెళ్లాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తేల్చిచెప్పారు.