రైల్వేల పేరుతో దేశ సంపదను బ్రిటీషర్లు దోచుకున్నారన్న విజయ్ దేవరకొండ
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
బ్రిటీషర్లు ఉద్దేశ్యపూర్వకంగా దాచిన నిజాలపై రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ రెండో ఎపిసోడ్ ద్వారా దేశ సంపద దోపిడీ వెలుగు చూసిందని నటుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి ప్రచారంలో భాగంగా రికార్డు చేసిన ఈ ప్రత్యేక సిరీస్ యూట్యూబ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియన్ రైల్వేలను ఉపయోగించి ట్రిలియన్ డాలర్ల విలువైన సంపదను బ్రిటీషర్లు తరలించుకుపోయారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.