ఉల్లాస్ కార్యక్రమం కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రమంత్రి జయంత్ సింగ్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

దేశంలో వయోజన అక్షరాస్యతను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ఉల్లాస్ నవ భారత్ సాక్షరతా కార్యక్రమం కింద ఉపాధ్యాయ విద్యా సంస్థల కోసం నూతన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తాజాగా విడుదల చేశారని కేంద్ర విద్యాశాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రత్యేక మార్గదర్శకాల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ సంస్థల పాత్ర మరింత బలపడటంతో పాటు విద్యాభివృద్ధికి సరికొత్త బాటలు పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.