గ్రామస్థాయిలో మాదిగ సమాజ ఐక్యత కోసం ఆత్మీయ సమ్మేళనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామకుప్పం
రామకుప్పం మండలంలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సమాజ ఐక్యత, చైతన్యం, గ్రామస్థాయి సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగింది. నాయకత్వం బలపడాలని నాయకులు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాదిగ, గోవిందప్ప మాదిగ, ఎంపీ ప్రకాష్, విజయ్ కుమార్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.