శత్రు రాడార్లకు చిక్కని డ్రోన్ రూపొందించిన సర్వేశ్ శర్మ
రిపోర్టర్: కిరణ్
స్థలం: హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దినసరి కూలీ కుమారుడు, పాలిటెక్నిక్ విద్యార్థి సర్వేశ్ శర్మ రక్షణ రంగం కోసం రుద్ర ఎడ్జ్ టీ-1 డ్రోన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ నుంచి రూ. 3.50 కోట్ల గ్రాంట్ మంజూరైంది. సరిహద్దుల్లో సైన్యం ఎదుర్కొంటున్న నిఘా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు ఆయన తెలిపారు.