ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మరియు స్కూళ్లకు సెలవులు ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మయం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లోని పాఠశాలలకు సెప్టెంబర్ 23న సెలవు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.