ఇరాన్ సంచలనం: రహస్య అజ్ఞాత భూగర్భ క్షిపణి నగరాలను పరిశీలించిన సైనిక ప్రముఖులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

ఇరాన్ తన దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న రహస్య భూగర్భ సైనిక మౌలిక వసతులను ప్రపంచానికి ప్రదర్శించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ లో సుప్రీం లీడర్ ప్రతినిధి హోజ్జత్ అల్-ఇస్లామ్ అబ్దుల్లా హాజీ-సాదేఘి సబ్టెర్రేనియన్ నేవల్ క్షిపణి కేంద్రాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూగర్భ క్షిపణి నగరాలలో యాంటీ-షిప్ క్షిపణులు, బాలిస్టిక్ సిస్టమ్స్, వైమానిక రక్షణ పరికరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.