ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నీట్ యూజీ ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లు ఎంచుకోవాలని, పరిమితంగా పెడితే సీట్లు తగ్గే ప్రమాదం ఉందని వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయి సుధీర్ స్పష్టం చేశారు. జీవో 102 పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.