తాజ్ మహల్ వద్ద విదేశీ మహిళను వేధించిన యువకులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆగ్రా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ వద్ద ఫొటో షూట్ చేసుకుంటున్న విదేశీ మహిళను ముగ్గురు యువకులు నిరంతరం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను వెంబడిస్తూ, అనుమతి లేకుండా కన్నార్పకుండా చూడటమే కాకుండా ఇబ్బంది గురిచేశారు. ఇది గమనించిన జీ అనే స్థానిక ఫొటోగ్రాఫర్ వెంటనే అప్రమత్తమై ఆ యువకులను నిలదీశారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలాంటి ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫొటోగ్రాఫర్ సాహసాన్ని ప్రశంసిస్తూ, యువకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.