విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ భారీ నిరసన

రిపోర్టర్: విజయ్ స్థలం: Vijayawada

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అక్రమ నియామకాలను తీవ్రంగా ప్రశ్నిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఎంతగా ఆంక్షలు విధించి బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కదలివచ్చి తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు.