సౌదీ అరేబియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరిక: కఠిన నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జైలు శిక్షలు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులు ఆ దేశంలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన చట్టాలు మరియు ఆచారాలపై విధిగా అవగాహన పెంచుకోవాలని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు స్పష్టం చేశాయి. స్థానిక చట్టాలు తెలియక ఉల్లంఘించినప్పటికీ తక్షణ అరెస్టు, సుదీర్ఘ జైలు శిక్ష, భారీ జరిమానా లేదా దేశం నుంచి బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్, బ్రిటన్, భారత్ ఎంబసీలు తమ దేశ పౌరులను తీవ్రంగా హెచ్చరించాయి.