ఎన్టీఆర్ కాలనీలో శ్రీరాముల స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలం కె.కందులవారిపల్లి పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో శ్రీరాములు స్వామి వారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎండోమెంట్ శాఖ నిధులతో నిర్మించనున్న ఈ ఆలయ పనులకు భక్తులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆలయం త్వరితగతిన పూర్తి కావాలని ముక్కా వరలక్ష్మి ఆకాంక్షించారు. ఈ నిర్మాణం గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుందని ఆమె అన్నారు.