భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అరుంధతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.