అంపోలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన గుండ లక్ష్మీదేవి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గార
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. సోమవారం గార మండలం అంపోలులో నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో ఆమె పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు.