డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని వైయస్ జగన్ సంచలన ఆరోపణలు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ-2025లో స్పోర్ట్స్‌ కోటా పేరుతో పరీక్ష రాయకుండానే టీచర్‌ పోస్టులిచ్చారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పాలకుల మెడలు వంచుతామని హెచ్చరించారు. అటవీశాఖ పోస్టుల భర్తీలోనూ భారీగా అవకతవకలు జరిగాయని విమర్శించారు.