ఇరాన్ తర్వాత టర్కీపై ఇజ్రాయెల్ దాడులు: సంచలన విషయాలు వెల్లడించిన మొహ్సన్ రెజాయ్

రిపోర్టర్: రమేష్ స్థలం: టెహ్రాన్

ఇరాన్ తదుపరి టర్కీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలిద్ బిన్ సల్మాన్ హెచ్చరించినట్లు ఇరాన్ సీనియర్ సైనిక అధికారి మొహ్సన్ రెజాయ్ వెల్లడించారు. టెహ్రాన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా విధివిధానాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు ఈ నాల్గవ దేశాల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.