రాహుల్ గాంధీ సవాల్ పై అమిత్ షా ధ్వజం: చర్చకు సిద్ధమని స్పష్టీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హరియాణా

ఈవీఎంలు మరియు చొరబాటుదారుల అంశాలపై బహిరంగ చర్చకు రావాలంటూ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరియాణాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ కు నిజంగానే చర్చించే ధైర్యం ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా కాపాడుకుంటోందని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.