రహదారిపై పడిపోయిన వినాయక విగ్రహం

రిపోర్టర్: G SUDHEER KUMAR స్థలం: సదాశివనగర్

సదాశివనగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి సమీపంలో కోరుట్ల నుండి ట్రాలీపై తెస్తున్న భారీ వినాయక విగ్రహం అదుపుతప్పి కింద పడిపోయింది. రావణ యూత్ సభ్యులు విగ్రహాన్ని తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్పై కూర్చున్న లైట్ల రాజు అనే యువకునికి తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విగ్రహం పాడవడంతో గ్రామస్థులు దానిని కొత్త చెరువులో నిమజ్జనం చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.