'ఆక్రమణలను తొలగించి గ్రంథాలయ స్థలాన్ని రక్షిస్తాం': ఎమ్మెల్యే పార్థసారథి
రిపోర్టర్: రాము
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ లైబ్రరీ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని గ్రంథాలయానికి అప్పగిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరిన లైబ్రరీ భవనాన్ని బుధవారం పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజనం రుచి చూసి నాణ్యతపై నిర్వాహకులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.