రీల్స్ కోసం కాకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
దేశ భవిష్యత్ కోసం ఉద్యోగులు రీల్స్ కాకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి ప్రాంతీయ కార్యశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారత్ అగ్రస్థానానికి ఎదగాలంటే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పని చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఏపీకి తొలిస్థానం దక్కడం గర్వకారణమని, టెక్నాలజీతోనే ప్రజాసేవల నాణ్యత పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు.