న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపిన వెన్ రెడ్డి రాజన్న

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంత ప్రజల అవసరాలు, సౌకర్యం కోసం మున్సిఫ్ కోర్ట్ ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వెన్ రెడ్డి రాజన్న కృషి మరువలేనిది. ఉన్నతాధికారులను ఒప్పించి మున్సిపల్ నిధులతో పాటు వ్యక్తిగత ఏర్పాట్లు చేసిన ఆయన సేవలు ప్రశంసనీయం. కోర్టు ప్రారంభమై నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యాయవాదులకు, స్థానిక ప్రజలకు ఆయన ప్రత్యేకంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.