ఈ నగరానికి ఏమైంది సీక్వెల్: ఈనెల 19న ఈఎన్ఈ రిపీట్ విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ఈఎన్ఈ రిపీట్ తెరకెక్కించినట్లు దర్శకుడు తరుణ్‌భాస్కర్ వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. స్నేహ బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని విశ్వక్సేన్ తెలిపారు.