విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని శ్రమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రవాణా రంగ కార్మికుల కుటుంబాలకు చెందిన 750 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పరచుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిరంతరం శ్రమించాలని సూచించారు.