పుట్టినరోజు వేడుకకు పిలవలేదనే కక్ష: బాలుడిని అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపిన దుండగుడు
రిపోర్టర్: రాము
స్థలం: Bareilly
పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించలేదనే కక్షతో ఓ యువకుడు పదిహేడేళ్ల బాలుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో కలకలం రేపింది. గోకుల్పూర్ గ్రామంలో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బర్త్ డే పార్టీకి రమ్మని పిలవలేదన్న కోపంతో మందు తాగి వచ్చిన నిందితుడు విశాల్ కుమార్ సృష్టించిన గొడవలో బాలుడు అర్జున్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.