తప్పుడు రికార్డులతో గ్రావెల్ క్వారీ అనుమతి.. లారీలను అడ్డుకుని గ్రామస్థుల ఆందోళన
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలంలోని నునపర్తి పంచాయతీ నడింపల్లి రెవెన్యూ పరిధి సర్వే నెం.2 లోని ఈనాం భూమిని జురాయితీ పట్టా భూమిగా చూపించి గ్రావెల్ క్వారీకి తప్పుడు అనుమతులు పొందారని గ్రామస్థులు ఆరోపించారు. మైనింగ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడమే కాకుండా, గ్రావెల్ తరలింపునకు ప్రభుత్వ చెరువుకు గండి కొట్టడంతో నునపర్తి, నడింపల్లి, దొప్పర్ల గ్రామాల ప్రజలు బుధవారం ఏకమై లారీలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నగేష్, కొల్లి వరహాలురావు, పల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.