ఇంటి నుంచే ఎల్ఎల్ఆర్ పరీక్ష రాసే కొత్త విధానం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు రవాణా కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచి ఆన్లైన్లో ఎల్ఎల్ఆర్ పరీక్ష రాసే సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభ్యర్థులు తమ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కెమెరా నిబంధనలను పాటిస్తూ నేరుగా పరీక్ష రాసి ఎల్ఎల్ఆర్ పొందవచ్చని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని డీటీవో కార్యాలయాలపై రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని వారు పేర్కొన్నారు.