స్థానిక సంస్థల ఎన్నికలు: మూడో జాబితా విడుదల చేసిన టీడీపీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Amaravati

స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మూడో జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మిని, ఒంగోలు మేయర్ అభ్యర్థిగా నల్లమిల్లి శ్రీశిల్పను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పలు మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ అభ్య్రధులను కూడా అధికారికంగా ప్రకటించారు.