గిరిజన భూముల పరిరక్షణకై ఆర్టీఐ అస్త్రం సంధించిన బాధితుడు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులు నిర్మించిన అక్రమ కట్టడాలపై వివరాలు కోరుతూ గరిమండ గ్రామానికి చెందిన కోర్ర తిరుపతిరావు సమాచార హక్కు చట్టం కింద కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ప్రధాన బజారులో నిర్మించిన వ్యాపార దుకాణాలు, హోటళ్లు, శాశ్వత నివాసాలకు సంబంధించిన అధికారిక రికార్డులను వెంటనే అందించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.