ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా రూపకల్పనకు ఈసీ ఆదేశాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీ శాసనమండలిలోని ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాల నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీలు బొర్రా గోపిమూర్తి, కల్పలతారెడ్డి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుండటంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఏర్పాట్లపై మార్గదర్శకాలు విడుదల చేశారు. నవంబరు 6 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.