నానక్‌రామ్‌గూడలో మంత్రి కాస్మోస్ స్థలం కబ్జా యత్నం కలకలం

రిపోర్టర్: కృష్ణ స్థలం: రంగారెడ్డి

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని మంత్రి కాస్మోస్ వాణిజ్య భవన ప్రాంగణంలో కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి దుండగులు యత్నించారు. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే చంద్రశేఖర్‌రెడ్డి సూచనలతోనే ఈ ఆక్రమణకు యత్నించినట్లు ఫిర్యాదు అందడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి, అత్యవసర మార్గాలను బ్లాక్ చేయడంతో ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.