స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు: ఓటర్లలో భయం తొలగించాలంటూ కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్తో కలిసి శనివారం ఆయన వెబెక్స్ ద్వారా ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘా ఉంచాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.