మలేషియా చిక్కుల నుండి విముక్తి పొందిన యువకులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నలుగురు యువకులు మలేషియాలో చిక్కుకుపోగా, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఉపాధి కోసం విజిటింగ్ వీసాపై వెళ్లిన వజ్రపుకొత్తూరు, సోంపేట మండలాలకు చెందిన యువకులు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకున్న మంత్రి, వెంటనే భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. ఆయన ప్రత్యేక కృషితో యువకుల తిరుగు ప్రయాణం సుగమం కావడంతో, వారి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.