రాప్తాడు నిందితుడు హేమంత్ పై పోలీసు కాల్పులపై హైకోర్టులో పిటిషన్
రిపోర్టర్: సతీష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై దాడి నిందితుడు హేమంత్ పై పోలీసులు జరిపిన కాల్పులపై ఏపీ హైకోర్టులో ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు సమాచారం. ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సిన అవసరం ఏమిటని, నిందితుడిని ఆసుపత్రిలోకి ఈడ్చుకెళ్లిన వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. అటవీ ప్రాంతంలో పడిపోవడం వల్ల గాయాలయ్యాయన్న పోలీసుల వివరణపై వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో నిజానిజాలు తేల్చాలని పిటిషనర్ అభ్యర్థించారు.