ఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ధర్నా

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. బీజేపీకి అనుకూలంగా ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.