భారతీయం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

నైతిక విలువల సలహాదారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ వేడుకలో ప్రముఖులు, విద్యార్థులు పెద్దఎత్తున హాజరై ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు సంస్కృతి, సాంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.