ఏపీలోని జూ పార్కుల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

సింగపూర్ మందాయ్ కేంద్రం తరహాలో విశాఖ, తిరుపతి జూ పార్కులను అభివృద్ధి చేయాలని శాసనసభ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒక్కో జూ పార్కుకు ఏటా రూ.3 కోట్ల చొప్పున కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సమీకరించాలని నిర్దేశించింది. విశాఖ జూ అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నిధులు సేకరించాలని, పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సూచించింది.