పార్లమెంట్లో చర్చకు సిద్ధమంటూ రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్
రిపోర్టర్: మహేష్
స్థలం: Lucknow
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో చర్చించే ఉద్దేశం విపక్షాలకు లేదని మండిపడ్డారు. కేవలం రోడ్లపై గందరగోళం సృష్టించడమే వారి ప్రధాన లక్ష్యమని అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.