విజయనగరం జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు!
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు గురువులు ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గోగాడ సన్యాసిరావు, జాతీయ పురస్కార గ్రహీత కె.రాజేష్, పొట్టా శ్రీనివాసరావు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. విద్యారంగంలో వీరు అందిస్తున్న విశేష సేవలకి ఈ గుర్తింపు దక్కింది.