కడ్తాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

కడ్తాల మండల కేంద్రంలో అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8:30 గంటలకు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.