వన్యప్రాణులపై విద్యార్థుల్లో అవగాహన: కవ్వాల అభయారణ్య పరిరక్షణ అందరి బాధ్యత
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
జన్నారంలో వన్యప్రాణి సప్తహరోత్సవాల్లో భాగంగా ఫారెస్ట్ రేంజ్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వన్యప్రాణులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ పిలుపునిచ్చారు. అడవుల పరిరక్షణలో పెద్ద పులుల పాత్ర కీలమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేశారు.