ఈ-వేస్టేజ్ నుండి కీలక ఖనిజాల వెలికితీతపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక అవసరాల కోసం కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ-వేస్టేజ్ నుంచి అత్యంత కీలకమైన ఖనిజాలను సమర్థవంతంగా వెలికితీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ అవసరాలకు గట్టి పునాదులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.