ఢిల్లీకి తెలంగాణ డబ్బుల మళ్లింపుపై సీబీఐ విచారణ జరపాలి: దాసోజు శ్రవణ్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

రాష్ట్రంలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారంటూ కేంద్రమంత్రులు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర సీబీఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా బీజేపీ తీరు ఉందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు.