నిషేధిత భూముల జాబితా నుంచి సాగు భూములను తొలగించాలి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నిషేధిత 22ఏ జాబితాలో సాగు భూములు చేర్చడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రైతు సంఘం బృందం కారేపల్లి మండలంలో రైతులతో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో 22ఏ జాబితాను పెంచి రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తోందని విమర్శించారు. తక్షణమే నిషేధిత జాబితా నుంచి సాగు భూములను తొలగించి రైతులకు అన్ని హక్కులు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.