ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వ తీరు దారుణమంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, వారిపై జరిగిన దౌర్జన్యాలు తీవ్రంగా ఖండించదగినవని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారని, తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. తాను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేసిన అనిత.. ఉపాధ్యాయుల కష్టాలు, వారి ఆత్మగౌరవం ఏమిటో తనకు సంపూర్ణంగా తెలుసని స్పష్టం చేశారు.